దేశ వ్యాప్తం గా కరోనా కేసులు పెరుగడం.. ఓమిక్రాన్ వ్యాప్తి పై ప్రజలను ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చిరించాయి. కరోనా కేసులు, ఓమిక్రాన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ తో పాటు ఐసీఎంఆర్ కీలక ప్రకటణ చేశాయి. మన దేశంలో ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు మన దేశం లో వెలుగు చూసిన ఓమిక్రాన్ కేసుల లక్షణాలు స్వల్పం గా నే ఉన్నాయని ప్రకటించింది.
అయితే ఓమిక్రాన్ మాత్రం తెలికగా తీసుకోవద్దని హెచ్చరించింది. అలాగే కరోనా కేసులు కూడా రోజు రోజు కు పెరుగుతున్నాయని అన్నారు. దేశం లో ని 19 జిల్లా లో 10 శాతం కు మించి కేసులు నమోదు అవుతున్నాయని తెలిపింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే 5 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా లో ఆంక్షలు విధించాలని రాష్ట్రాల ను ఆదేశించింది. అలాగే వంద శాతం వ్యాక్సినేషన్ కు కృషి చేయాలని సూచించింది. అలాగే ప్రజలు మాస్క్ పెట్టు కోవడం నిర్లక్యం చేస్తున్నారని.. మాస్కే సరి అయినా ఆధారం అని అన్నారు. మాస్క్ లేక పోతే ప్రమాదం తప్పదని హెచ్చిరించింది.