ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి అమలుపై పెద్ద వివాదం చెలరేగుతోంది. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా చర్చలు జరిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యే అవకాశం ఉంది. పిఆర్సి పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి.
ఇందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ కాబోతున్నాయి. ఈ సందర్భంగా పిఆర్సి అమలుపై వారితో సీఎం జగన్ చర్చించనున్నారు. అంతే కాదు ఇవాళ సాయంత్రం దీనిపై ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులు అడిగినంత ఇస్తారా లేక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పీఆర్సీని అమలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రభుత్వం 30 శాతం పిఆర్సి అమలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది.