తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులను పనులకు పంపిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పని చేయించుకుంటే… ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది సర్కార్.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది. చిన్నారులను తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులేనని వార్నింగ్ ఇచ్చింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.