మూడు రాజ‌ధానుల‌ను చేసి తీరుతాం : కొడాలి నాని

-

గుడివాడలో జగనన్న గృహ హక్కు పథకాన్ని ప్రారంభించి,లబ్ధిదారులకు రిజిష్టర్ దస్తావేజులు పంపిణీ చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఈ సంద‌ర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ఏపీలో మూడు రాజ‌ధానులు చేసి తీరుతామ‌ని.. సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదన్నారు. అమరావతి కూడా రాజ‌ధాని ఉంటుందని.. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజదాని వికేంద్రీకరణ అని చెప్పారు.

అమరావతి అందరిది అంటున్న వాడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారని.. అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామినీ పూజిస్తే, పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారని చెప్పారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టిన రాజదాని అమరావతి అని.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒక్కటేన‌ని స్ప‌ష్టం చేశారు. 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అమరావతి ఏర్పాటు చెయ్యాలని నాడు ప్రతి పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పారని… ఈ విషయంపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని కొడాలి నాని సవాల్ విసిరారు. తనకు చెందిన వారికి లబ్ది చేకూర్చేందుకే ల్యాండ్ పులింగ్ పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నాడని… అమరావతి పేరుతో టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని చేతులెత్తి ప్రజలకు కోరుతున్నాన‌ని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news