స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలు బన్నిలోని నటుడినే కాదు సుకుమార్ దర్శకత్వ ప్రతిభను అందరికి తెలిసేలా చేశాయి. 2004లో వచ్చిన ఆర్య సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఫీల్ మై లవ్.. ఫీల్ మై లవ్ అంటూ సుకుమార్ తన ప్రేమని అందరు ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేశాడు. ఇక ఆ తర్వాత బన్నితో ఆర్య-2 సినిమా చేశాడు సుకుమార్.
ఆ సినిమా కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఆర్య సీరీస్ తో వచ్చేందుకు సిద్ధమయ్యారు అల్లు అర్జున్ సుకుమార్. ప్రస్తుతం త్రివిక్రం తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 19వది కాగా 20వ సినిమా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రంగస్థలం సినిమాతో మైత్రి మేకర్స్ కు బాగా క్లోజ్ అయిన సుకుమార్ వారితో వరుస సినిమాలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. మహర్షి తర్వాత మహేష్ చేస్తున్న సుకుమార్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది.