టీఎంసీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టాటా మెమోరియల్ సెంటర్ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

jobs
jobs

ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వారణాసిలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జనవరి 8వ తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. కనుక ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, డిప్లొమా ఇన్ ఆంకాలజీ, బీఎస్సీ(నర్సింగ్) పాసైన వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేయనున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు 44,900 రూపాయల నుంచి 53,100 రూపాయల వరకు వేతనం ఉంటుంది. అప్లై చేసుకునే వారికి సంబంధిత పనిలో అనుభవం తప్పక ఉండాలి. https://tmc.gov.in/index.php/en/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలని చూడచ్చు. 2022 సంవత్సరం జనవరి 15 హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ. సంస్థ ఉత్తరప్రదేశ్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి వుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news