ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కల్లోలం కలిగిస్తోంది. రోజురోజుకు కొత్త ప్రాంతాలకు కరోనా వేరియంట్ వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ శరవేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. మనదేశంలో ఇప్పటికే 350కి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. క్రిస్మస్, న్యుఇయర్ వేడుకలు పై ఆంక్షలు విధిస్తున్నాయి పలు రాష్ట్రాలు ప్రభుత్వాలు. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ప్యూని అమలు చేస్తున్నాయి.
తాజాగా యూపీ లోని యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓమిక్రాన్ విస్తరిస్తున్న సమయంలో యూపీ మొత్తం కర్ప్యూ కిందకు వెళ్లబోతోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 25 నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యూపీలో కర్ప్యూ విధించనున్నారు. వివాహాలకు 200 మందికి మించి అనుమతి లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రజలు గుమికూడకుండా పలు ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వ నైట్ కర్ప్యూని విధించింది. ముంబైలో అర్థరాత్రి నుంచి 144 సెక్షన్ విధిస్తున్నారు. గుజరాత్ లో 9 నగరాల్లో నైట్ కర్ప్యూ విధిస్తున్నారు. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి. కేరళలో పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.