కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పథకం పీఎం కిసాన్ యోజన. ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి 2వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు ఇస్తున్నారు. తెలంగాణ లో రైతు బంధు మాదిరిగానే ఈ పథకం కూడా పని చేస్తుంది. అయితే చాలా మంది రైతులకు కిసాన్ యోజన డబ్బులు అందడం లేదు. కిసాన్ యోజన డబ్బులు ఖాతాలో పడాలి అంటే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా డబ్బులు ఖాతాలో పడాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డును లింక్ చేయాలి. అంతే కాకుండా పీఎం కిసాన్ అకౌంట్ వివరాలు మరియు ఆధార్ కార్డ్ లోని వివరాలు సరిపోతేనే ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. దానికోసం బ్యాంక్ కు వెళ్లి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ పై సంతకం చేసి ఇవ్వాలి. ఆధార్ వివరాలను ముందుగా వెరిఫై చేసి ఆ తర్వత ఆన్ లైన్ సీడింగ్ చేస్తారు. వెరిఫికేషన్ పూర్తి అయ్యాక మీ ఫోన్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తరవాత పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.