ఏపీలో మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ర్యాంకింగ్ లు వచ్చింది ఏ రంగంలో అని ఆలోచిస్తున్నారా….వ్యవసాయరంగంలో తెలుగు రాష్ట్రాలు ఈ స్థానాల్లో నిలిచాయి. ఎనిమిది సూచికల ఆధారంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాంకింగ్ లను ఇచ్చారు. కాగా 0.634 స్కోరు తో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 6.3 శాతం ఉండగా 2021 లో 11.3శాతానికి చేరుకుంది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ది రేటు 4.7 శాతం నుండి 12.3 శాతం కు పెరిగింది. అదే విధంగా పాల ఉత్పత్తి లో వార్షిక వృద్ది రేటు 1.4 శాతం నుండి 11.7 శాతానికి పెరిగింది. దాంతో ఏపీ టాప్ లో నిలిచింది..ఇక తెలంగాణ రాష్ట్రం ఏడవ స్థానాన్ని సొంతం చేసుకుంది.