“రాధే శ్యామ్” ట్రైలర్ పై గోగినేని ఫైర్…బుద్ది ఉందా..? సిగ్గులేదా అంటూ…!

-

ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ కాంటెస్టెంట్ బాబు గోగినేని ప్రభాస్ రాధే శ్యామ్ ట్రైలర్ పై ఫైర్ అయ్యారు. రాధే శ్యామ్ ట్రైలర్ లో ప్రభాస్ విక్రమాదిత్య గా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ లో విక్రమాదిత్య ఐన్స్టీన్ ఆఫ్ పాల్మిస్ట్రీ అంటూ స్వామీజీ వేషంలో ఉన్న కృష్ణం రాజు అంటారు. కాగా దీనిని తప్పు పడుతూ ప్రభాస్ పై ట్రైలర్ పై గోగినేని నిప్పులు చెరిగారు.

గిగినేని పోస్ట్ లో …..”మానవవాది, హేతువాది, విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్ తుప్పు జోతిష్యాన్ని ఖండించి తిరస్కరిస్తే, ఎవడో ఒక బెవార్స్ క్యారక్టర్ గాడిని ‘Einstein of Palmistry’ అని అనిపిస్తావా సినిమా లో? బుద్ధి ఉందా? సిగ్గు లేదా? జీజస్ ఆఫ్ హిందూ ఇజం లేక అంబేడ్కర్ ఆఫ్ బుద్ధిజం అంటే ఎలా ఉంటది అంటావు ఫెలో? మీ సినిమా వాళ్ళ పైత్యం మరీ ఎక్కువైపోతోంది. కాస్త తగ్గండి.” అంటూ గోగినేని మండి పడ్డారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news