బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

-

నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష అని.. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమే అని మంత్రి ఫైర్ అయ్యారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై ఇవాళ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
బీజేపీ ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కేటీఆర్.

ktr

ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా…? మీ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా? అని నిలదీశారు. కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాదుకున్న అద్బుత అవకాశమైన ఐటిఐఅర్ ప్రాజెక్టును రద్దు చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు కేటీఆర్. లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి…మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా?  అని ఫైర్ అయ్యారు. మీ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుందని.. యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర మీదని అగ్రహించారు.

కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీదని.. డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా… ? అని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా.. ? అని చురకలు అంటించారు కేటీఆర్. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news