పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరి ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష వైఖరిపై సీఎం ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులను అందరికీ వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్ 150 ఎకరాల్లో వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కాగ కేసీఆర్ వరి వేసిన పొలాన్ని ఈ రోజు జరిగే రచ్చబండ కార్యాక్రమంలో రాష్ట్ర ప్రజలకు చూపిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కాగ రేవంత్ రెడ్డి ఎర్రవెల్లి లో రచ్చబండ కార్యాక్రమం నిర్వహించడం పై అధికార పార్టీతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాగ సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తాను రచ్చబండ కార్యాక్రమానికి రాను అని తెల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి రచ్చబండ చేసేది ఉమ్మడి మెదక్ జిల్లా అని.. ఇక్కడి నుంచి తను ఒక్కిరినే ఎమ్మెల్యేగా ఉన్న అని అన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కార్యాక్రమం ప్రకటించారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మీడియా ముందు చేయను అని చెప్పానని గతంలో అన్నానని అన్నారు. కానీ రచ్చబండకు రాకుంటే.. తన గురించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని అందుకే మీడియా ముందుకు వచ్చానని అన్నారు.