యూకేలో కరోనా విలయ తాండవం… రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు..

-

ప్రపంచాన్ని కరోనా మరోసారి చుట్టు ముడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రపంచం మళ్లీ ఓమిక్రాన్ బారిన పడింది. దీంతో ఓ వైపు ఓమిక్రాన్.. మరో వైపు డెల్టా వేరియంట్లతో కేసుల సంఖ్య పెరగుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడి యూకే, ప్రాన్స్, డెన్మార్క్ వంటి దేశాలు ఓమిక్రాన్, కరోనా కేసులతో అల్లాడుతున్నాయి. ముఖ్యంగా యూకే దేశంలో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. 

యూకేలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,29,471 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,38,676 కి చేరింది. ఒక్క రోజు 18 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1,48,021కి చేరింది. ఇదిలా ఉంటే యూకేలో ఓమిక్రాన్ వేరియంట్ వల్లే ఎక్కువ కేసులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే ఓమిక్రాన్ కేసులు సంఖ్య లక్షను దాటింది. మరణాలు కూడా 30కి పైగా నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news