కారులో కుమ్ములాటలు..క్లారిటీగా లేని కమలం, కాంగ్రెస్..

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. దీంతో కేసీఆర్ ఏది చెబితే అదే అన్నట్లు పరిస్తితి ఉండేది. ఏ నాయకుడు కూడా తిరుగుబాటు చేసేవారు కాదు. పదవులు రాలేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్తితి టోటల్‌గా మారింది. టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుందనే సంగతి తెలిసిందే. దీంతో సొంత పార్టీ నేతలు కూడా ఎదురు తిరిగే పరిస్తితి వచ్చింది.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఇంతకాలం పదవులు దక్కని నేతలు ఇప్పుడు బహిరంగంగానే పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు చోట్ల టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నేతలు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి వెళ్ళినట్లు కనిపిస్తోంది. వరంగల్ మేయర్ గుండు సుధారాణికి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌లకు పెద్దగా పొసగడం లేదని తెలుస్తోంది.

ఈ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వరంగల్‌లో కారు రెండు ముక్కలయ్యే పరిస్తితి వచ్చింది. పైగా వరంగల్ కార్పొరేషన్‌లో మేయర్ వర్గం కార్పొరేటర్లకు, ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లకు పెద్దగా పడటం లేదు. ఏదైనా డివిజన్ పరిధిలో మేయర్ పర్యటిస్తుంటే…ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరు కావడం లేదు. ఒక్క తూర్పు ఎమ్మెల్యేతోనే కాదు…వరంగల్‌ పరిధిలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా సుధారాణికి అంతగా పడటం లేదని తెలుస్తోంది.

ఇలా వరంగల్‌ కారులో ఆధిపత్య బాగా ఎక్కువైంది. ఇది టీఆర్ఎస్‌కి మైనస్ అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కు గానీ పికప్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. కానీ ఆ రెండు పార్టీలు పెద్దగా ఫోకస్ చేసి పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. క్లారిటీగా వరంగల్‌లో రెండు పార్టీలు బలపడే విధంగా పనిచేయడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news