కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీ షాక్… సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్

-

కర్ణాటకలో అధికార బీజేపీకి షాక్ తాకింది. పట్టణ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది. కర్ణాటకలో మొత్తం 1,184 వార్డులతో కూడిన 58 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన మొత్తం 1,184 స్థానాల్లో కాంగ్రెస్ 498 సీట్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 437, జనతాదళ్ (సెక్యులర్) 45, ఇతరులు 204 సీట్లు గెలుచుకున్నారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ కు ఈ ఫలితాలు మంచి జోష్ ను నింపాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం కాంగ్రెస్‌కు 42.06 శాతం, బీజేపీకి 36.90 శాతం, జేడీఎస్‌కు 3.8 శాతం, ఇతరులు 17.22 శాతం ఓట్లు పోలయ్యాయి.

పట్టణ పురపాలక సంఘాలు, పట్టణ పంచాయతీలు మరియు నగర పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి.  ఇందులో నగర పురపాలక సంఘాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. పట్టణ పంచాయతీలు, పట్టణ పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులను కైవసం చేసుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news