రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. !

-

రేషన్‌ కార్డు, ఇళ్ల స్థలాలు లేని వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే మీడియాతో మాట్లాడుతూ… నిరాశ్రయులు, నిరుపేదలకు సొంత గుర్తింపు కార్డులు లేవని.. ఇళ్ల స్థలాలు కూడా లేవన్నారు. దీంతో వారి పేరుతో రేషన్‌ కార్డులు లేకపోవడవతో ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇలాంటి వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకువచ్చి.. వివరాలను సేకరిస్తోందని.. ప్రకటన చేశారు.

జనాభాలోని ఈ వర్గాన్ని పథకం పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వారిని గుర్తిం చే ప్రక్రియ చివరి దశలో ఉందని… త్వరలోనే.. వారి వివరాలను సేకరించి రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలను అందజేస్తామని వెల్లడించారు. రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు లేక నిరాశ్రయులైన వారిని గుర్తిం చేందుకు రేషన్‌ కార్డులు లేని నిరుపేదలను గుర్తించేందుకు కొత్త వ్యవస్థను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని ద్వారా నిరు పేదలకు చాలా లాభం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news