తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్, న్యూయర్ ఎఫెక్ట్ బాగానే చూపుతుంది. ఈ సెలబ్రెషన్స్ తర్వాత ప్రతి రోజు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజా గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1052 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో గత కొద్ది నెలల నుంచి ఒక్క రోజులో నమోదు అయిన కేసులలో ఇదే అత్యధికం. కాగ సోమవారం రాష్ట్రంలో 482 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంటే నిన్నటి తో పోల్చుకుంటే దాదాపు 100 శాతానికి పై గా కేసులు పెరిగడం రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని తెలుస్తుంది.
ఇదే థర్డ్ వేవ్ కు సూచిక అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అలాగే గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో కరోనా మహమ్మారితో ఇద్దరు మరణించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,858 గా ఉంది. అలాగే రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో 10 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వచ్చిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య 94 కు చేరుకుంది.