కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయింది : తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరిక

-

తెలంగాణ రాష్ట్ర డిహెచ్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదు అయ్యాయని.. యూకే లో మొత్తం మూడు లక్షల కేసులు నమోదు అయినట్లు వివరించారు. ఇక ఇండియాలో మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందని…నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని హెచ్చరించారు శ్రీనివాసరావు. దేశంలో 15 రాష్టాల్లో మూడోవేవ్ స్టార్ట్ అయ్యింది. ఢిల్లీలో ఒక్క రోజే 10 వేల కేసులు నమోదు అయినట్లు తెలిపారు.

తెలంగాణలో 1600 కేసులు నిన్న నమోదు అయ్యాయి. జిహెచ్ఎంసి, మేడ్చల్, రంగారెడ్డిలో కేసులు పెరిగాయని… చెప్పారు. దేశంలో 2 నుంచి 6 రేట్లు కేసులు పెరిగాయని… తెలంగాణలో నాలుగు రేట్లు కేసులు పెరిగాయని హెచ్చరించారు. తీవ్రమైన సమస్యలు తలెత్తకుండా ఉండటం మంచి పరిణామమని… రాష్ట్రంలో బెడ్ల కొరత లేదని తెలిపారు. ఇప్పుడు కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఐదు రోజుల్లో కోలుకుంటున్నారని.. 95 శాతం మంది పాజిటివ్ కేసుల్లో లక్షణాలు ఉండటం లేదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ ఉంది. వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచనలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news