ప్రధాని మోడీకి రాష్ట్రపతి కోవింద్ ఫోన్.. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆరా

పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీని భద్రతా వైఫల్యంపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందంటూ.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో కూడా పిటిషన్ దాఖలైంది. భద్రతా వైఫల్యంపై రేపు విచారణ జరుపనుంది.

ఇదిలా ఉంటే ప్రధాని మోదీకి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఫోన్ చేశారు. భద్రత వైఫల్యం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. మరికొద్ది సేపట్లో మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ తో భేటీ కానున్నారు.

president ram nath kovind and pm modi

నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి.. పంజాబ్ ప్రభుత్వం సరిగ్గా భద్రతను కల్పించలేకపోయింది. ఈ అంశంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రధాన మంత్రి కాన్వాయ్ దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై  కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. మరోవైపు పంజాబ్ ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.