కేటీఆర్, సంతోష్ లకు అస్సలే పడదు: బాంబు పేల్చిన కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. టీఆర్‌ఎస్‌ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్, జోగినిపల్లి సంతోష్ కుమార్‌ లకు అసలే పడదని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నట్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో కొట్లాటలు అడుగుతున్నారని.. మాది పెద్ద పార్టీ..కుమ్ములాటలు సహజమని చెప్పారు.

సమయం వచ్చినప్పుడు కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. జేపీ నడ్డా కంటే కెసిఆర్ అవినీతి గురించి నాకు ఎక్కువ తెలుసు అని.. సెంట్రల్ విజిలెన్స్ కి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తాము ఎవరితో గొడవలు పడటం లేదని.. బీజేపీ రెండేళ్లుగా కెసిఆర్ ను జైళ్లో పెడతామని.. అన్నారు… కానీ ఏం చేశారని ప్రశ్నించారు. కెసిఆర్ ను అరెస్ట్ చేస్తుంటే ఎవరు అడ్డుకుంటున్నారు అని నిలదీశారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా దగ్గర సీఎం కెసిఆర్ అవినీతి చిట్టా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.