పాల్వంచ ఘటన నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు ప్రతి పక్ష పార్టీలు కొత్తగూడెం జిల్లా బంద్ కు పిలుపును ఇచ్చారు. దీంతో ఈ రోజు తెల్లవారు జామున నుంచే కొత్తగూడెంలో బంద్ కొనసాగుతుంది. వనమా రాఘవను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు ఇతర పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఉంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే వనమా రాఘవ పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాగ పై డిమాండ్లతో కొత్తగూడె బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. బస్సులను అడ్డుకుంటున్నారు. అలాగే వామపక్ష లతో పాటు ఇతర పార్టీలు కూడా బంద్ సందర్భంగా ఆందోళన చేస్తున్నాయి. కాగ తమకు వనమా రాఘవ ఇంకా దొరకలేదని కొత్తగూడెం ఏఎస్పీ ప్రకటించడంతో ఆందోళన ఇంకా పెరుగుతున్నాయి. ఇంత వరకు వనమా రాఘవను ఎందుకు అరెస్టు చేయాలేదంటు ప్రతిపక్షపార్టీల నాయకులు పోలీసులపై మండి పడుతున్నారు.