కరోనా సోకిన తన భార్యతో.. హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ఈ కరోనా మహమ్మారి ఇప్పడు… టాలీవుడ్‌ ప్రముఖులను వెంటాడుతోంది. ఇప్పటికే… టాలీవుడ్‌ స్టార్లు మహేష్‌ బాబు, విశ్వేక్‌ సేన్, మంచు మనోజ్, వరలక్ష్యి, మంచు లక్ష్మి కరోనా బారీన పడ్డారు. ఇక తాజాగా… టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ భార్య శాలిని కి కూడా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో నితిన్‌ భార్య ప్రస్తుతం హో క్వారంటైన్‌ లో ఉంది.

అయితే… నితిన్‌ భార్య శాలిని పుట్టిన రోజు నిన్న జరిగింది. అయితే.. ఆమెకు కరోనా పాజిటివ్‌ రావడంతో… నితిన్‌ వేరైటీగా శాలిని పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. రెండో ఫ్లోర్‌ లో ఉన్న తన భార్య శాలినికి కనిపించేలా… గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో కేక్‌ కట్‌ చేశాడు నితిన్‌. కేక్‌ కట్‌ చేసిన అనంతరం… శాలిని కి గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచే కేక్‌ ఇచ్చి.. తాను తినేశాడు. అయితే.. శాలిని పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఇక నితిన్‌కు శాలిని పైన ఉన్న ప్రేమను చూసి.. ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.