బండి సంజయ్ శ్రీ కృష్ణుడు.. కెసిఆర్ ఓ కంసుడు : శివరాజ్ సింగ్ చౌహాన్

-

నీ పొట్టను చీల్చుకుంటూ వస్తాం.. దమ్ముంటే ఆపు అని సిఎం కెసిఆర్ కు మధ్యప్రదేశ్ సీఎం సవాల్ విసిరారు. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదని చురకలు అంటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని.. కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా కంసుడిలాగే భయపడుతున్నారని.. నీ అన్యాయ పాలనకు నిప్పు పెట్టేదాక విడిచిపెట్టమని హెచ్చరించారు.

మా పార్టీ నేతలపై లాఠీ ఝుళిపిస్తావా.. నిన్ను అంత ఈజీగా విడిచిపెట్టమని.. మేము బిర్యానీ అనుకున్నవా.. తినడానికి.. పొట్టను చీల్చుకుంటూ వస్తామని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కలలో కూడా బండి సంజయ్ వస్తున్నట్టున్నాడని.. కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి.. ఇంకా ఎవరన్న ఉంటే వారిని కూడా చేస్తాడేమో అంటూ చురకలు అంటించారు. నీవు రెండో సారి సీఎంవే…. కానీ నేను నాలుగోసారి సీఎం అయ్యానని ఎద్దేవా చేశారు.

సోనియాగాంధీ మాపై పోటీకి భయపడుతోంది.. పంజాబ్ లో అన్యాయంగా ప్రధాని మోడీని అడ్డుకున్నారన్నారు. అక్కడ సోనియా గాంధీ, ఇక్కడ కేసీఆర్.. ఒకేలా తయారయ్యారని.. కేసీఆర్ ముందు సమాధానం చెప్పు.. నిరుద్యోగులకు ఉద్యోగలిచావా, నిరుద్యోగ భృతి ఇచ్చావా.. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చావా? అని ప్రశ్నించారు. నువ్వొక భయపడే ముఖ్యమంత్రివి కేసీఆర్.. 2023 లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news