జూన్ 30 లోగా కారుణ్య నియామకాల భర్తీ : సీఎం జగన్

-

సిఎం జగన్ ఇవాళ ఏపీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భాంగా సిఎం జగన్ ఓ అదిరిపోయే శుభవార్త చెప్పారు. కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రకటన చేశారు. జూన్‌ 30 వ తేదీ లోగా ఈ కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేయాలని అ«ధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని… మీ అందరి సమక్షంలో సీఎస్‌ గారికి మళ్లీ చెప్తున్నానని పేర్కొన్నారు సిఎం జగన్.

Jagan
Jagan

అలాగే ఈహెచ్‌ఎస్‌ – ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని.. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చానన్నారు. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వస్తుందని పేర్కొన్నారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news