BREAKING : టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆయన సతీమణికి తీవ్ర గాయాలు

-

కోరుట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం పూట.. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఉదయం పూట… టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంట్లో.. పిండి పదార్థాలు చేస్తుండగా… గ్యాస్‌ లీకై ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

దీంతో… ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని… మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే.. ఈ అగ్ని ప్రమాదంలో… ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు.. భార్య సరోజ కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు భార్య సరోజ ను హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది.ఈ ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news