కరోనా మహమ్మారి న్యూ రికార్డ్ …. ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్లను దాటిన కరోనా కేసులు

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చైనా వూహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై తన ప్రభావాన్ని చూపించింది. ఫస్ట్ వేవ్, సెకండ్, థర్డ్ వేవ్ ల రూపంలో ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. కరోనా కేసులు సంఖ్య 30 కోట్లను దాటింది. మరణాల సంఖ్య 54 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను పరిశీలిస్తే.. అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 6 కోట్లకు పైగా కేసులు నమోదు కాగా… రెండో స్థానంలో ఇండియా 3.5 కోట్ల కేసులతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో 2.2 కోట్లతో బ్రెజిల్ ఉంది. యూకేలో 1.4 కోట్ల కేసులతో 4వ స్థానంలో, ప్రాన్స్ 1.1 కోట్ల కేసులతో ఐదో స్థానంలో ఉంది. రష్యా, పెరూ మొదలైన దేశాల్లో కూడా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news