దేశంలో మరో ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధం అవుతోంది. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ని విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి దగ్గరపడటంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో.. ఎన్నికలసంఘం అధికారులు ఇటీవల సమావేశం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఎన్నికలు జరగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని భావించిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో గత రెండు నెలల నుంచే ఎన్నికల వాతావరణం వచ్చింది. అన్ని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారాాలు చేయడంతో పాటు…హమీల వర్షం కురిపిస్తున్నాయి.