హైదరాబాద్ వాసులకు కేసీఆర్ సర్కార్ మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగరంలో మరో 27 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకు రావాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర వైద్యా రోగ్య శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. భవనాల గుర్తింపు, సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది నియామకం తుది దశకు చేరుకుందని.. త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని.. ఓ అధికారి స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 256 బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలు అందుతున్నాయి. బస్తీ దవాఖానాల్లో 54 రకాల పరీక్షలు, పలు వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఇతర ఆస్పత్రులకూ సిఫారసు చేస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఈ దవాఖానాల్లో నిర్వహిస్తుండటం గమనార్హం. కొత్తగా ఏర్పాటు చేసే ఈ 27 బస్తీ దవాఖానాలను మరో నెల రోజుల వ్యవధిలోనే ఏర్పాటు చేయాలని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్నయం తో.. హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.