దానిమ్మ సాగు చేస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

-

మన రాష్ట్రంలో దానిమ్మ సాగు చేస్తే చాలా మంచిగా లాభాలు వస్తాయి. ఈ వాతావరణం దానిమ్మ సాగు కి బాగా అనుకూలం. అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే న్యాయమైన దానిమ్మ కాయలు పండించచ్చు. వీటిని పెంచడానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. చాలా తక్కువ నీళ్ళు ఉంటే సరిపోతుంది. కేవలం దానిమ్మ చెట్లకి అవసరమైనంత వరకు నీళ్లు అందిస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్లు అందించడం వల్ల సమస్యలు వస్తాయి.

బ్యాక్టీరియా, వైరస్ వ్యాధి ఉధృతమవుతుంది. అలానే దానమ్మ ఏడాది పొడవునా కాపుకొస్తుంది. దీని వలన దిగుబడి తగ్గడమే కాకుండా సాగు ఖర్చు కూడా పెరుగుతుంది. మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువే. అయితే దానిమ్మ సాగు చేసే రైతులు చీడపీడలు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా జాగ్రత్తగా చూసుకుంటే మంచి లాభాలు వస్తాయి.

జనవరి ఫిబ్రవరి మాసాలలో ఒకసారి పూర్తవుతుంది, జూన్ జూలై నెలలో ఒకసారి వస్తుంది. జూన్ నెలలో వర్షాలు కురిసే ప్రాంతాలలో ఈ పంట తీయడం కొంచెం కష్టం. సెప్టెంబర్ లో చెట్లు బేట్టకు గురైనప్పుడు కొమ్మలు కత్తిరించి ఎరువులు వేసి నీరు పెడితే అక్టోబర్ మాసంలో కోతకు వస్తాయి. ఫిబ్రవరి మార్చి మాసంలో కాయి కోతకు వస్తుంది.

6 సంవత్సరాల వరకు 30-50 కాయలు,ఆపైన 60 కాయలవరకు కాస్తాయి. కొన్ని రసాయనాలు వాడితే పూత పిందె రాలేల చేయొచ్చు. అయితే రసాయనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మోతాదుకు మించి వాడితే రాలిపోతాయి పండ్లు, యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక నాణ్యమైన దిగుబడులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news