ప్రభాస్ కోసం హాలీవుడ్ డైరెక్టర్లు ఎగబడుతున్నారు : టాలీవుడ్ నిర్మాత

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌… బాహుబలి సినిమాతో ఓ రేంజ్‌ కు వెళ్లాడు. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో ప్రభాస్‌. రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ – కె లాంటి పాన్‌ ఇండియాలో మూవీస్‌ లో ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్నారు. దీంతో ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది.

ఇలాంటి తరుణంలో… సీనియర్‌ నిర్మాత, వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ ప్రభాస్‌ పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రభాస్‌ హాలీవడు్‌ డైరెక్టర్ల దృష్టిలో పడ్డారని.. అతని కోసం చాలా మంది వెంటపడుతున్నారని ఆయన వెల్లడించారు. అతడితో సినిమా తీసే అవకాశాలను పరిశీలిస్తున్నారని.. తెలిపారు. హాలీవుడ్‌ డైరెక్టర్ను ఇంతలా ఆకర్షిస్తున్న భారతీయ కథనాయకుడు ప్రభాస్‌ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్ట్‌ కె చిత్రం తర్వాత ప్రభాస్‌ కేరాఫ్‌ అడ్రస్‌ హాలీవుడ్‌ గా మారుతుందనడంలో సందేహమే లేదని వెల్లడించారు. కాగా.. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా జనవరి 14న విడుదల కావాల్సి ఉండేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news