ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,68,063 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు… 6.5 శాతానికి చేరింది. ఇక దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది.
ఇక దేశంలో తాజాగా 277 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,84,213 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 46,569 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 33,470 కరోనా కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 19,286 కేసులు, ఢిల్లీలో 19,166 కేసులు, తమిళనాడులో 13,990 కేసులు, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.
COVID-19 | India reports 1,68,063 fresh cases, 69,959 recoveries & 277 deaths in the last 24 hours
Active case tally reaches 8,21,446. Daily positivity rate (10.64%)
Omicron case tally at 4,461 pic.twitter.com/ikKRh2Xh6G
— ANI (@ANI) January 11, 2022