కేసీఆర్ కు ఎన్టీఆర్ గతే పడుతుంది : ఈటల రాజేందర్

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఎన్టీఆర్‌ కు పట్టిన గతే పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం , మంత్రులు కుంభ కర్ణుడిగా నిద్ర పోతూ ఉద్యోగులను పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరిగారు. దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆగ్రహించారు.

దీనికి కారణం సీఎం కేసీఆర్‌ అని ఫైర్ అయ్యారు. టీఆర్‌ ఎస్‌ పార్టీకి ఉద్యోగులు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతరేస్తారంటూ కామెంట్‌ చేశారు. మహబూబ్‌ నగర్‌ బీజేపీ నిరసన సభలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగ వర్గానికి సంఘీభావం తెలపడం కోసమే బీజేపీ పార్టీ నేతలు రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ రాచరిక పాలన కొనసాగుతుందని ఓ రేంజ్‌ రెచ్చి పోయారు ఈటల రాజేందర్‌. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news