కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ.. డిమాండ్స్‌పై డెడ్‌లైన్‌

-

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని ఫైర్‌ అయ్యారు. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రమైన ఉద్యమాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న ఈ తరుణంలో వాటిని దారి మళ్లించేందుకే ప్రధానమంత్రి గారికి బహిరంగ లేఖ పేరిట మీరు కొత్త డ్రామాకు తెరదీసినట్లు కన్పిస్తోందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

మీరు అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో ‘సకినాల పిండి’ని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అయినా మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా ఎదురు దాడి చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నందున వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని వెల్లడించారు బండి సంజయ్‌.

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తానని ఇచ్చిన మాటకు కేంద్రం కట్టుబడి ఉందని… ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలులో భాగంగా ఏటా కనీస మద్దతు ధరను పెంచడంతోపాటు రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news