జహీరాబాద్ పరిసరప్రాంతాల్లో తాత ముత్తాతల కాలం నుంచి సంక్రమించిన పండుగలరోజు గుండు ఎత్తే ఆట కనుమరుగవుతుంది. దశాబ్దాల క్రితం వరకూ సంక్రాంతి, ఉగాది లాంటి పండుగ సందర్భాల్లో గ్రామంలో గల హనుమాన్ దేవాలయం పరిసరాలు, దుర్గా పరిసరాల్లో గుండుఎత్తి బహుమతి గెలుపొందే శారీరకమైన పోటీలు నిర్వహించే వారు. 50, 75, 100 కిలోల బరువు గల గుండు వయస్సు వారి తక్కువ సమయంలో ఎక్కువ సార్లు ఎత్తిన వారిని విజేతగా ప్రకటించే వారు.