మళ్ళీ ‘మూడు’ ముందుకు.. జగన్ తగ్గేలా లేరుగా!

-

ఏపీలో రాజధాని అంశం ఓ కొలిక్కి వచ్చేలా లేదు.. రాష్ట్రం విడిపోయాక ఏపీకంటూ ఒక రాజధాని లేకుండా పోయింది. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఇక  అమరావతిని ఏదో సింగపూర్ చేసేస్తానని చెప్పారు. కానీ అమరావతిని అలాగే ఉంచారు. దీని వల్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రూట్ మార్చారు. ఎన్నికల సమయంలో రాజధాని మారుస్తానని అసలు చెప్పలేదు. కానీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు.
Ys-Jaganmohan-Reddy
Ys-Jaganmohan-Reddy
కర్నూలు, అమరావతి, విశాఖపట్నంలని రాజధానులుగా చేసేందుకు బిల్లు కూడా తీసుకొచ్చారు. అయితే ఈ మూడు రాజధానులకు కొందరు మద్ధతు తెలిపితే.. కొందరు అమరావతికి మద్ధతు తెలిపారు. అయినా సరే అధికార బలం ఉండటంతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని తీసుకొచ్చేశారు. ఇక దీనికి వ్యతిరేకంగా చాలామంది కోర్టుకు వెళ్లారు. అయితే బిల్లులో పలు లోపాలు ఉండటం వల్ల కోర్టులో నిలబడటం కష్టమని జగన్ ప్రభుత్వానికి అర్ధమైంది. అందుకే మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నారు.
అలా అని అమరావతి రాజధానిగా ఉంటుదని చెప్పలేదు. మళ్ళీ సమగ్రమైన బిల్లుని రూపొందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. అయితే మూడు రాజధానుల బిల్లు ఇంకా రాదులే అని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లుని రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందని తెలిసింది.

 

మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కొత్త బిల్లు ఎలా ఉండాలనే విషయంపై జగన్.. ఈ నెల 21న జరిగే మంత్రివర్గ భేటీలో చర్చిస్తారని తెలిసింది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును తీసుకుని రావడానికి చూస్తున్నారని సమాచారం. ఒకవేళ కుదరని పక్షంలో ఖచ్చితంగా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news