IPL 2024 : ముగిసిన లక్నో ఇన్నింగ్స్… రాజస్థాన్ టార్గెట్ ఎంత అంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో ఓపినర్ డికాక్ దారుణంగా నిరాశపరిచారు.

3 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. చివరి మ్యాచ్లో సెంచరీ తో రాణించిన స్టోయినిస్ ఈ మ్యాచ్లో డక్ అవుట్ గా వెనుతిరిగాడు. ఇక మూడో వికెట్ కు లక్నో కెప్టెన్ రాహుల్, దీపక్ హుడా 62 బంతుల్లో 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీపక్ హుడా 31 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. రాహుల్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు.మిగత బ్యాటర్లంతా విఫలమయ్యారురాజస్థాన్ బౌలర్లలో సందీప్ 2 వికెట్లు ,బౌల్ట్, అవేష్ ఖాన్, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news