గత వారం రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలోని బస్టాప్స్, రైల్వే స్టేషన్లు కిట కిటలాడాయి. సంక్రాంత్రి పర్వదినం నేపథ్యంలో…. హైదరాబాద్ నివసించే వారంతా.. తమ సొంతూళ్లకు వెళ్లారు. ఇక ఇవాళ్టి తో సంక్రాంతి పండుగ పూర్తి కానుంది. దీంతో సొంతూళ్ల కు వెళ్లిన ప్రయాణికులు.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఇవాళ్టి నుంచి సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు ప్రయాణికులు.
ఇక గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగరమంతా బోసిపోయింది. నగర వాసులంతా సొంతూళ్ల కు వెళ్లడంతో.. నగరం బోసిపోయింది. అయితే… ఇవాళ్టి నుంచి మళ్లీ తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే ఏర్పాట్లు చేస్తున్నాయి. 110 రైళ్లను ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక ఇటు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంతూళ్లకు వెళ్లిన వారి కోసం ఏకంగా 3500 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.