ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్..ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం

-

మన దాయాది దేశం అయిన పాకిస్తాన్.. ప్రస్తుతం అష్ట దిగ్బంధనం లో ఉంది. ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్ దేశం కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ విదేశీ వాణిజ్యం పూర్తిగా క్షీణించి పోయింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు దొరకక పోవడంతో ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేయడానికి నిధులు, ప్రజల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు నిధుల సమీకరణ లాంటివి తీసుకువచ్చేందుకు పాక్‌ సర్కార్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రుణాలు దొరకడం లేదు.

ఈ నేపథ్యంలోనే.. ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త జాతీయ భద్రత పాలసీని పాకిస్తాన్ సర్కార్ తీసుకువచ్చింది. ఈ పాలసీ ప్రకారం. పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కల్పిస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆఫ్ఘనిస్తాన్, అమెరికా మరియు చైనా దేశాలకు ఈ పాలసీ వర్తిస్తుంది అని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త పాలసీతోనైనా..  పాక్ ఆర్థిక పరిస్థితి మెరుగుపుడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news