ఐపీఎల్ 2022 కి ముందు అహ్మదాబాద్, లక్నో అనే రెండు కొత్త ఫ్రొచైంజ్ లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే రాబోయే ఐపీఎల్ కోసం వచ్చె నెల 12, 13 తేదీలలో బీసీసీఐ ఆధ్వర్యంలో మెగా వేలం జరగనుంది. కాగ ఇప్పటికే పాత ఫ్రొచైంజ్ లకు రిటేన్షన్ ప్రక్రియా ముగిసింది. ప్రస్తుతం కొత్త ఫ్రొచైంజ్ లు అయిన లక్నో, అహ్మదాబాద్ తమకు కేటాయించిన ముగ్గురు ప్లేయర్లను ఎంచుకునే పని పడ్డాయి.
కాగ లక్నో ఫ్రొచైంజ్ ఎంచుకోవాల్సిన ముగ్గురు ప్లేయర్ల వివరాలను ఈ రోజు బీసీసీఐ కి పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. కింగ్స్ పంజాబ్ మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ తో పాటు టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయిని లక్నో ఫ్రొచైంజ్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అందుకోసం దాదాపు 30 కోట్లను లక్నో ఫ్రొచైంజ్ ఖర్చు చేసినట్టు సమాచారం. కెఎల్ రాహుల్ కోసం రూ. 15 కోట్లు, మార్కస్ స్టొయినిస్ కోసం 11 కోట్లు, రవి బిష్ణోయి కోసం 4 కోట్లును లక్నో ఫ్రొచైంజ్ వెచ్చించినట్టు తెలుస్తుంది. కాగ లక్నో జట్టు కెప్టెన్ గా కె ఎల్ రాహుల్ వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది.