ఎస్‌బీఐ బ్యాంకులో IMPS, NEFT ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే ఎంత చార్జి చెల్లించాలో తెలుసా..?

-

ఎస్‌బీలో నెఫ్ట్ ద్వారా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ప్పుడు బ్యాచ్‌ల వారీగా ట్రాన్స్‌ఫ‌ర్లు అవుతాయి. అన్ని ప‌నిదినాల్లో ఉద‌యం 8 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు నెఫ్ట్ ప‌నిచేస్తుంది.

ఏ బ్యాంకులోనైనా స‌రే.. ఐఎంపీఎస్ ద్వారా డ‌బ్బుల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే చాలా త్వ‌ర‌గా వెళ్తాయి. అదే NEFT (నెఫ్ట్‌) ద్వారా అయితే కొంత స‌మ‌యం పడుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశంలో ఉన్న బ్యాంకులన్నీ ఈ ప‌ద్ధ‌తుల్లో న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేందుకు వీలుగా నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నాయి. అలాగే న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసినందుకు కొంత రుసుమును కూడా వ‌సూలు చేస్తున్నాయి. అయితే బ్యాంకుల‌ను బ‌ట్టి ఈ రుసుం భిన్నంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఐఎంపీఎస్‌, నెఫ్ట్ ప‌ద్ధ‌తుల్లో ఎస్‌బీఐ ద్వారా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే ఎంత రుసుం విధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఎంపీఎస్ ద్వారా ఎవ‌రైనా స‌రే రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు గ‌రిష్టంగా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు. రాత్రి 10.45 నుంచి 11.45 గంట‌ల మ‌ధ్య ఐఎంపీఎస్ సేవ‌లు ప‌నిచేయ‌వు. ఆ స‌మ‌యంలో డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసినా ఆ త‌రువాతే న‌గదు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. ఇక ఐఎంపీఎస్ సేవ‌ల‌ను ఈ స‌మ‌యంలో కాకుండా రోజులో మిగిలిన ఏ స‌మ‌యంలోనైనా వాడుకోవ‌చ్చు. అలాగే ఐఎంపీఎస్ సేవ‌లు 24 గంట‌లూ, 365 రోజులూ ప‌నిచేస్తాయి. సెల‌వు రోజుల్లోనూ ఐఎంపీఎస్ సేవ‌లు ప‌నిచేస్తాయి.

ఎస్‌బీఐలో ఐఎంపీఎస్ ద్వారా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే కింద చెప్పిన విధంగా చార్జిలు ఉంటాయి.

* రూ.1వేయి వ‌ర‌కు న‌గదు పంపితే ఎలాంటి చార్జిలు ఉండ‌వు.
* రూ.1001 నుంచి రూ.10వేల వ‌ర‌కు రూ.1 చార్జితోపాటు జీఎస్‌టీ చెల్లించాలి.
* రూ.10,001 నుంచి రూ.1 ల‌క్ష‌ వ‌రకు రూ.2 + జీఎస్టీ ఉంటుంది.
* రూ.1,00,001 నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రూ.3 + జీఎస్టీ చెల్లించాలి.



ఎస్‌బీలో నెఫ్ట్ ద్వారా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ప్పుడు బ్యాచ్‌ల వారీగా ట్రాన్స్‌ఫ‌ర్లు అవుతాయి. అన్ని ప‌నిదినాల్లో ఉద‌యం 8 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు నెఫ్ట్ ప‌నిచేస్తుంది. అయితే ఉద‌యం 8 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల లోపు మాత్ర‌మే న‌గదు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే.. అదే రోజు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాయి. ఇక సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7 గంట‌ల మ‌ధ్యలో నెఫ్ట్ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే అదే రోజు లేదా మరుస‌టి రోజు న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. ఈ క్ర‌మంలో ఎస్‌బీఐ నెఫ్ట్ ద్వారా గరిష్టంగా రూ.10 ల‌క్ష‌లు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

ఎస్‌బీఐలో నెఫ్ట్ ద్వారా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే ఎంత రుసుం చెల్లించాలంటే…

* రూ.10వేల వ‌ర‌కు బ్రాంచిలో అయితే రూ.2.50 చెల్లించాలి. అదే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అయితే రూ.2 చార్జి అవుతుంది.
* రూ.10వేల నుంచి రూ.1 ల‌క్ష వ‌ర‌కు బ్రాంచ్‌లో రూ.5, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌కు రూ.4 చెల్లించాలి.
* రూ.1 ల‌క్ష నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు బ్రాంచిలో రూ.15, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు రూ.12 చెల్లించాలి.
* రూ.2 ల‌క్ష‌ల క‌న్నా మించిన నెఫ్ట్ ట్రాన్స్‌ఫ‌ర్‌ల‌కు బ్రాంచిలో రూ.25 చెల్లించాలి. అలాగే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అయితే రూ.20 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news