జనసేన పార్టీ కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం వేధిస్తుందని నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు తాము భయపడేది లేదని, ఎలాంటి శక్తులను అయినా ఎదిరిస్తామని ఆయన అన్నారు.
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రముఖ సినీ నటుడు నాగబాబు అన్నారు. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తుందని ఆయన అన్నారు. గుంటూరులో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులతో నాగబాబు సమావేశమై మాట్లాడుతూ… రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేను గెలిపించాలని అన్నారు. అందుకు గాను పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. జనసేనలో తాను సభ్యత్వం తీసుకోలేదని, అయినా.. ఎన్నికల్లో పవన్‌కు మద్దతుగా ఉంటానని, జనసేన తరఫున ప్రచారం చేస్తానని నాగబాబు తెలిపారు.
జనసేన పార్టీ కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం వేధిస్తుందని నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు తాము భయపడేది లేదని, ఎలాంటి శక్తులను అయినా ఎదిరిస్తామని ఆయన అన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించినా, తాము పైకి ఎదుగుతామని అన్నారు. జనసేన కార్యకర్తలపై చేయిపడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
రాజకీయాల్లో పవన్ ప్రస్తుతం ఒంటరివాడని.. అయినప్పటికీ ఆయన వెంట మెగా అభిమానులు ఉంటారని నాగబాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలని, టీడీపీకి బుద్ధి చెప్పాలని నాగబాబు ప్రజలను కోరారు. ఏపీలో కుల రాజకీయాలు బాగా పెరిగిపోయాయని, వాటికి చెక్ పెట్టాలంటే.. పవన్ సీఎం కావాలని అన్నారు. ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారని, అలాంటి వారు పవన్‌కు, జనసేనకు అండగా నిలవాలని అన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేయాలని, నీతివంతులైన నేతలు అధికారంలోకి వచ్చేలా చూడాలని అన్నారు. జనసేనను అధికారంలోకి తేవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగబాబు స్పష్టం చేశారు.