దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజూ వారీ కేసుల సంఖ్య రోజకు మూడు లక్షలకు చేరువైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వ్యాక్సినేషన్ వేగవంత చేయడంతో పాటు… నైట్ కర్ఫ్యూలతో పలు ఆంక్షలు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 10,057 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సంక్రాంతి పండగ తర్వాత నుంచి కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర సీఎస్ ఆధ్వర్యంలో పలువురు ఐఏఎస్ లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు చికిత్సను పర్యవేక్షించడంతో పాటు ఆక్సిజన్ సరఫరా, హోం ఐసోలేషన్ కిట్లు, అత్యవసర మందుల సరఫరా తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షిస్తారు.