తెలంగాణ : కరోనా నియంత్రణపై నేడు మంత్రుల సమీక్ష

-

తెలంగాణలో వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేవలం వేల లోపే ఉన్న కేసులు ప్రస్తుతం 3 వేలను దాటాయి. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 3557 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు 14 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మెడ్చల్- మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హన్మకొండ, సంగారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి, పెద్దపల్లి, మహబూబ్ నగర్, సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.

ktr and harish rao

కరోనా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఈరోజు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య శాఖ అధికారులు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. జిల్లాల వారీగా కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను గురించి చర్చించనున్నారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. కరోనా కట్టడికి చర్యలు, వ్యాక్సినేషన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా.. అధికారులను ఆదేశించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news