నేడు ఏపీ కేబినేట్ భేటీ.. పీఆర్సీ పై కీలక ప్రకటన

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… పిఆర్సి వ్యవహారం ముదురుతోంది. ఈ పిఆర్సి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వార్ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సి ఎస్ కు ఏపీ ఉద్యోగుల సంఘాల నేతలు.. సమ్మె నోటీస్ కూడా ఇవ్వనున్నారు.

jagan
jagan 

ఈ తరుణంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ ఇవాళ స‌మావేశం కానుంది. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రి మండ‌లి స‌మావేశం కానుంది. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రి మండ‌లి భేటీ అవుతున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర మంత్రి మండ‌లి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా  పీఆర్సీ పై రాష్ట్ర కేబినెట్ లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.అలాగే సినిమా టికెట్ల ధ‌రల విష‌యంలో కూడా రాష్ట్ర కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news