కారు పాతదే… ధరే చాలా కొత్తది…

-

షాక్ అయ్యారా? దిమ్మ తిరిగిందా. కారు ఏంది 338 కోట్లు పెట్టి కొనుక్కోవడం ఏంది. అది కూడా పాతది అంటున్నారు.. అంటూ షాక్ మీద షాక్ తినకండి. దాని విశిష్టత ఏందో తెలుసుకుందాం పదండి.

అది 1962 మోడల్ ఫెర్రారీ కారు. మీరు పైన చూస్తున్నారు కదా అదే కారు. దానికే వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. 250 జీటీవో మోడల్ కారు అది. రీసెంట్ గా యూఎస్ లోని కాలిఫోర్నియాలో సౌత్ బీ అనే కంపెనీ వేసిన వేలంలోనే దీనికి అంత ఖరీదు పెట్టి కొన్నారు.

అయితే.. ఇలా ఓ పాత కారుకు ఇన్ని కోట్ల రూపాయల ధర పలకడం ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు 2014లోనూ ఇదే ఫెర్రారీకి చెందిన 1963 మోడల్ కారు 265 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే.. ఫెర్రారీ కంపెనీకి చెందిన ఈ మోడల్ కార్లే ఇంత ధర పలుకుతున్నాయి. మరే కార్లు రికార్డు స్థాయిలో ఇంత ధర పలకలేదు.

మరి వీటికున్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ మోడల్ కార్లను 1953-64 మధ్య ఫెర్రారీ కంపెనీ 36 కార్లను మాత్రమే తయారు చేసింది. అందుకే ఈ కార్లకు అంత డిమాండ్. ఈ కార్లు అప్పుడు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే పటిష్టంగా ఉన్నాయట. ఈ కార్లు గంటకు 174 మైళ్ల వేగంతో దూసుకుపోగలవట. దీన్ని తయారుచేసి 56 ఏళ్లు అయినా.. ఇప్పటికీ ఎటువంటి సమస్యా లేకుండా అంతే వేగంగా దూసుకుపోగలవట. ప్రత్యేకించి ఈ కారు 1962-65 మధ్య జరిగిన రేసుల్లో దూసుకెళ్లిందట. 15 రేసుల్లో ఈ కారు గెలిచిందట. అందుకే ఈ కారుకు ఇంత డిమాండ్ మరి.

Read more RELATED
Recommended to you

Latest news