3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండి : పోలీసులపై యనమల సెటైర్లు

-

పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసులపై , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల సెటైర్లు పేల్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలనకు పోలీసుల దౌర్జన్యం తోడయిందని నిప్పులు చెరిగారు. టీడీపి నేత బుద్దా వెంకన్న అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

yanamala ramakrishnudu

సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైసీపీ గుండాలను వదలి టీడీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కొడాలి నాని.. కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా, సభ్యసమాజం తలదించుకునేలా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు? ఆగ్రహించారు.

వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? 3 ఏళ్లలో ఎంతమంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసారు? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పినట్టు విని డిజిపి, డి. జి. పి చెప్పినట్టు విని కొంతమంది పోలీసులు వారి భవిష్యత్ ను వారే అంధకారంలోకి నెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news