సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం హరిత హారానికి తోడుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సర్పంచ్ చిడెం బాబురావు, మేడారం ఇంచార్జ్ డిఎస్పి దేవేందర్ రెడ్డి మేడారంలో సోమవారం మొక్కలు నాటడం జరిగింది. మేడారానికి వచ్చే భక్తులు ఒక్కొక్క మొక్కను నాటాలని వారు సూచించారు. పోలీస్ సిబ్బంది, ఇతర నాయకులు పాల్గొన్నారు.