ఉత్తరభారతీయులు చలికాలంలో మొక్క జొన్న రొట్టెలు తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే మొక్క జొన్న రొట్టెలని చలి కాలంలో తినడం వల్ల కేవలం మంచి రుచి పోషక పదార్థాలు మాత్రమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చాలా సమస్యల్ని ఇది తరిమికొడుతుంది. అయితే మరి చలి కాలంలో మొక్క జొన్న రొట్టెలు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చునని ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని గురించి ఇప్పుడే పూర్తిగా చూసి వుండండి.
పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి:
మొక్కజొన్నలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్-సి, బి1, బి2, కాల్షియం, పొటాషియం ఉంటాయి. కాబట్టి మొక్క జొన్న రొట్టెలు తింటే ఈ పోషక పదార్ధాలని తీసుకోచ్చు.
కంటి ఆరోగ్యానికి మంచిది:
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలానే కంటి ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:
ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మొక్క జొన్న రొట్టెలు బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలానే హైపర్ టెన్షన్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఉండవు. కార్డియో వాస్కులర్ సమస్యలు డయాబెటిస్ వంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి ఈ మొక్క జొన్న రొట్టెలు తయారు చేసుకొని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.