హిందుత్వపై దేశంలో మొదటిసారిగా పోటీచేసిన పార్టీ శివసేనే…- సంజయ్ రౌత్

-

శివసేన, బీజేపీ ల మధ్య మాటల యుద్దం కోనసాగుతూనే ఉంది. శివసేన పార్టీ బీజేపీై పలు విమర్శలు చేస్తున్నారు. హిందుత్వపై దేశంలో మొదటిసారిగా పోటీ చేసిన పార్టీ శివసేనే అని ఆపార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ కొత్త నాయకులుకు, నవ హిందుత్వ వాదులకు చరిత్ర తెలియదని.. వారి చరిత్ర పేజీలను ఎందరో చించివేశారని విమర్శించారు. బీజేపీ పార్టీకి ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంటాం అని సంజయ్ రౌత్ అన్నారు.

గోవా ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ కూడా ఒంటరిగా శివసేన పోటీ చేయాలని సవాల్ విసురుతోంది. మహారాష్ట్రను వదిలిపెట్టి ఉత్తర భారత దేశంలో మేం పోటీ చేసి ఉంటే బీజేపీ వారి పార్టీ నుంచి ప్రధానమంత్రిని చూసేది కాదని సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. కేవలం హిందుత్వను బీజేపీ అధికారం కోసమే వాడుకుంటుందని ఆరోపించారు. బాబ్రీ తరువాత ఉత్తరాదిలో శివసేన వేవ్ ఉండేదని.. ఆసమయంలో పోరాడిఉంటే శివసేన నుంచి ప్రధాన మంత్రి అయ్యేవారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే బీజేపీ పొత్తుతో 25 ఏళ్లు మేం వేస్ట్ చేశామని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news