ఏపీ ఉద్యోగులకు షాక్..కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు

-

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తానని ప్రభుత్వ సలహాదారు సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదనీ.. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదనీ పేర్కోన్నారు.ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి ఉండేదన్నారు.కొత్త పేస్కేళ్లతో వేతన బిల్లులను రూపోందిస్తున్న డీడీఓలను పని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

హెచ్ఆర్ఏ శ్లాబుల పై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధమేనన్నారు.ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువే ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించిందని…పదే పదే చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడామని చెప్పారు.ఆర్ధిక సమస్యల కారణంగా ఒకటీ రెండు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలకు ముందే చెప్పామన్నారు.ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్మెంట్ పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయనీ..ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించటం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news